మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చాం. పీఆర్సీ, పదవివిరమణ వయసుపై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్ వ్యవస్థను క్రియాశీలం చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్ వ్యవస్థకు అధికారాల అప్పగింతను పరిశీలిస్తాం.
See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
” పురపాలక ఎన్నికలు వీలైనంత త్వరలో నిర్వహించాలని నిర్ణయించాం. నూతన పురపాలిక చట్టం తీసుకురావడంపై ఆలోచిస్తున్నాం. జులైలో ఎన్నికలు ముగించే ప్రయత్నం చేస్తాం. సినీ దర్శకుడు ఎన్.శంకర్ స్టుడియో కట్టాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. శంకర్పల్లి సమీపంలో ఐదెకరాల స్థలం ఎకరాకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించాం. ఆయన తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నారు. శారదా పీఠం ట్రస్ట్‌కు రెండెకరాల భూమి కేటాయించాం. సంస్కృత పాఠశాల, సాంఘిక కార్యకలాపాలకు భూమి కేటాయించాం” అని కేసీఆర్ వెల్లడించారు.
See Also : చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !
See Also : దేశంలోనే తొలిసారిగా”రేవంత్ రెడ్డి”..!