ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2014నుంచి ఇప్పటి వరకు హోదా కోసం కట్టుబడి ఉన్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తామని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐదేళ్లలో అధికారాన్ని, నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనేక సార్లు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. జన్మభూమి కమిటీలతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. అంతేకాదు అసెంబ్లీలో ఒక హాట్ టాపిక్ పై కాసెపు పెద్ద చర్చ జరిగింది. అలాగే నెల్లూరులో జరిగిన ఒక వివాహేతర హత్యను కూడా టీడీపీ నేతలు రాజకీయంగ వాడుకుంటున్నారని, ఆ హత్య భార్య చేయించిన విషయం తెలుసుకోకుండా ఆమె ఇంటికి వెళ్లి వైసీపీ నేతలు చేయించారని ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పారని గుర్తు చేసారు. అలాగే 40ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆద్వర్యంలో నడుస్తున్న టీడీపీ నేతలు రాజకీయ హత్యలకు, అక్రమ సంబంధాలకు సంబంధించిన హత్యలకు తేడా తెలుసుకోవాలని నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి క్లాస్ పీకారు.
