ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలోని 14 కి 14 నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ఆరుగురు మొదటిసారి సభలో అడుగుపెట్టారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారే అసెంబ్లీలో అడుగుపెట్టడడం గమనార్హం.
ఇక కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఏకంగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించి సభకు వెళ్లారు. మంత్రులుగా నియమితులైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు గుమ్మనూరు జయరాం ఇద్దరూ రెండోసారి సభలో అడుగుపెట్టారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లనూ గెలుచుకుని వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అసెంబ్లీలో నేడు ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా ఎమ్మెల్యేలంతా వైసీపీ చెందిన వారే కావడం చరిత్రలోనే ప్రథమం.
మొదటిసారి అసెంబ్లీలో వీరే…
1 కర్నూలు – హఫీజ్‌ఖాన్
2 కోడుమూరు – సుధాకర్
3 పత్తికొండ- కంగాటీ శ్రీదేవి
4 నంద్యాల- శిల్పా రవి
5 ఆళ్లగడ్డ – గంగుల నాని
6 నందికొట్కూరు – ఆర్థర్
గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణిరెడ్డిని కలుపుకుని ఏకంగా ఏడుగురు ఎన్నికయ్యారు.