టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణలో గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గత కొంతకాలంగా హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు అని వైద్యులు తెలిపారు.
Tags chandhrababu died gadwal gattu bhimudu hyderabad niims slider tdp telangana ttdp