తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు జెడ్పీటీసీ,ఎంపీటీసీలుగా అత్యధిక స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మొత్తం ముప్పై రెండు జెడ్పీ స్థానాలను దక్కించుకున్న సంగతి కూడా విదితమే.
ఈ సందర్భంగా జెడ్పీటీసీ,ఎంపీటీసీ,జెడ్పీపీ,ఎంపీపీ,జెడ్పీ చైర్మన్లు,కోఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిశారు. ఈక్రమంలో కేటీఆర్ అందర్నీ పేరు పేరున పలకరించి అభినందనలు తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ”సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.
టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ప్రతి గడపకు చేరింది. అందుకే అసెంబ్లీ,ఎంపీ,ఎమ్మెల్సీ ,స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టారు”అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”సీఎం కేసీఆర్ నాయకత్వంలో అందరూ బాగా పనిచేయాలి..బంగారు తెలంగాణ సాకరం దిశగా అడుగులెద్దాం..సీఎం కేసీఆర్ గారి పాలన దేశానికి ఆదర్శంగా నిలిచింది.స్థానిక సంస్థల ప్రతినిధులు తమవంతు కృషి చేయాలి.సర్కారు సంక్షేమాభివృద్ధి పథకాలు ప్రజలకు అందించాలి అని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రతినిధులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు