Home / 18+ / జగన్ క్యాబినేట్ లోని మంత్రులు ఎవరెవరు ఏయే చదువులు చదువుకున్నారు

జగన్ క్యాబినేట్ లోని మంత్రులు ఎవరెవరు ఏయే చదువులు చదువుకున్నారు

జగన్ క్యాబినేట్ కొలువు తీరుతోంది. అయితే ఈ క్యాబినేట్ మంత్రులు ఏయే విద్యార్హతలు కలిగి ఉన్నారో చూద్దాం..

శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్‌, నరసన్నపేట నియోజకవర్గం:
ఈయన బీకాం చదువుకున్నారు.                                                                                                                                మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై  ప్రస్తుతం రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, చీపురుపల్లి నియోజకవర్గం :
ఈయన బీఏ చదువుకున్నారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు.వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో నిచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.

పాముల పుష్ప శ్రీవాణి, కురుపాం నియోజకవర్గం:
ఈమె బీఎస్సీ ,బీఎడ్ చదువుకున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

విశాఖపట్నం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, భీమిలి నియోజకవర్గం:
ఈయన ఇంటర్మీడియెట్ చదువుకున్నారు.
ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

తూర్పుగోదావరి నుంచి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మండపేట నియోజకవర్గం:
ఈయన బీఎస్సీ చదువుకున్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యే, వైఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు.

పినిపె విశ్వరూప్‌, అమలాపురం నియోజకవర్గం:
ఈయన బీఎస్సీ, బీఈడీ చదువుకున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా, వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.

కురసాల కన్నబాబు కాకినాడ రూరల్‌ నియోజకవర్గం:
ఈయన బీకాం, ఎంఏ చదువుకున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

పశ్చిమగోదావరి నుంచి తానేటి వనిత, కొవ్వూరు నియోజకవర్గం:
ఈమె ఎమ్మెస్సీ చదువుకున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆచంట నియోజకవర్గం:
ఈయన ఇంటర్మీడియట్ చదువుకున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), ఏలూరు నియోజకవర్గం:
ఈయన బీకాం చదువుకున్నారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

కృష్ణాజిల్లాలో పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నం నియోజకవర్గం:
ఈయన బీకాం చదువుకున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.

వెల్లంపల్లి శ్రీనివాస్‌.. విజయవాడ (పశ్చిమ) నియోజకవర్గం:
ఈయన పదో తరగతి చదువుకున్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

కొడాలి నాని,గుడివాడ నియోజకవర్గం:
ఈయన పదో తరగతి చదువుకున్నారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

గుంటూరు నుంచి మేకతోటి సుచరిత,నియోజకవర్గం ప్రత్తిపాడు:
ఈమె బీఏ చదువుకున్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

మోపిదేవి వెంకటరమణ,రేపల్లె నియోజకవర్గం:
ఈయన బీకాం చదువుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం.
వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.

ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గం ఒంగోలు:
ఈయన  ఇంటర్మీడియెట్‌ చదివారు.
ఐదుసార్లు ఎమ్మెల్యే, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.

ఆదిమూలపు సురేశ్‌, నియోజకవర్గం ఎర్రగొండపాలెం:
ఈయన ఐఆర్‌ఎస్‌ చదివారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి, నియోజకవర్గం ఆత్మకూరు:
ఈయన ఎమ్మెస్సీ (టెక్స్‌టైల్స్‌) చదివారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అనిల్‌కుమార్‌ యాదవ్‌,నెల్లూరు సిటీ:
ఈయన  బీడీఎస్‌ చదివారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి,డోన్‌ నియోజకవర్గం:
విద్యార్హత: బీఈ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
పీఏసీ ఛైర్మన్‌గా పనిచేశారు.

గుమ్మనూరు జయరాం,ఆలూరు నియోజకవర్గం:
ఈయన  పదోతరగతి చదివారు.
జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు.రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,పుంగనూరు నియోజకవర్గం:
ఎంఏ, పీహెచ్‌డీ (సోషియాలజీ) చదివారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసారు.

కె.నారాయణస్వామి, నియోజకవర్గం గంగాధర నెల్లూరు:
ఈయన బీఎస్సీ చదివారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

కడప నుంచి అంజద్‌ బాషా:
విద్యార్హత బీఏ.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

అనంతపురం నుంచి శంకరనారాయణ, నియోజకవర్గం పెనుకొండ:
ఈయన బీకాం, ఎల్‌ఎల్‌బీ చదివారు.
అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat