ప్రపంచకప్ కప్ లో భాగంగా మొన్న టీమిండియా,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ విజయం కూడా సాధించింది.అంతే బాగానే జరిగింది గాని ఇక్కడే ఐసీసీ, బీసీసీఐ మధ్య వివాదం మొదలైంది.అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో ధోని ధరించిన గ్లోవ్స్ మునిపటివి కాదు.ఇప్పుడు ధరించిన దానిపై బలిదాన్ గుర్తు ఉంది.వీడియోగ్రాఫర్లు దీనిని బాగా హైలైట్ చేయడంతో మహి అభిమానులే కాకుండా యావత్ భారత్ అతని దేశ భక్తిని మెచ్చుకున్నారు.అయితే ఈ విషయం ఐసీసీ గమనించిందా లేదా ఎవరైనా పిర్యాదు చేసారో తెలియదు గాని క్రికెట్ బోర్డ్ ఆ గుర్తిని తొలిగించాలని బీసీసీఐ సూసించింది.దీనిపై బీసీసీఐ ధోనికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది.ధోని ఈ గ్లోవ్స్ ధరించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని ప్రశ్నించింది.దీనికి ఘాటుగా స్పందించిన ఐసీసీ.మొదటి ఉల్లంఘన కాబట్టి జరిమానా విధించడం లేదని చెప్పుకొచ్చింది.మునిపటివరకు ఇది రెండు బోర్డులు మధ్య ప్రస్తావన కాగా ఇప్పుడు ఏకంగా దేశాన్నే కలవరపరిచింది.ఇప్పుడు ధోనికి యావత్ దేశం మద్దతు పలికింది.ధోనికే కాకుండా దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.