తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం విడుదలైన పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో మొత్తం 3,571ఎంపీటీసీలను,449జెడ్పీటీసీలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. గత ఐదేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టి అమలుచేసిన పలు సంక్షేమ పథకాల ఫలితంగా గ్రామస్థాయిలో ఈ స్థాయిలో ప్రజలు పట్టం కట్టారు.
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షేత్రస్థాయిలోని నేతలను సమన్వయపరుస్తూ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుండి ఎన్నికల ప్రచారం వరకు కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఇంచార్జుల వరకు అందర్నీ ఒకేతాటిపై తీసుకువచ్చి పరిషత్ లో కారు ప్రభంజనం సృష్టించడంలో తనదైన మార్కును ప్రదర్శించారు . స్థానికంగా నేతల మధ్య ఉండే భేదాభిప్రాయాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నేనున్నాను అనే భరోసానిస్తూ గ్రామాలల్లో పార్టీ క్యాడర్ బలోపేతంకై ఆహర్నిశలు కృషి చేశారు.
దీని ఫలితంగా గతంలో ఎన్నడూ ఎక్కడ లేనివిధంగా చరిత్రలో తొలిసారి ఇంతటి మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పల్లె ప్రజలను ఆకర్షించాయి. ఫలితంగానేఏకంగా మొత్తం 32 జిల్లాల జెడ్పీ పీఠాలనూ టీఆర్‌ఎస్‌కే కట్టబెట్టి.. తమ నిబద్ధతను నిరూపించుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం.. కేటీఆర్ మార్గనిర్ధేశకంలో గులాబీ జోరు ఇలా సాగింది.