ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో వైసీపీ అధినేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతటి కారణమైన రెండో వ్యక్తి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి. గత తొమ్మిదేళ్ళుగా వైసీపీ అధినేత,సీఎం జగన్ కు మద్దతుగా ఉండటమే కాకుండా పార్టీ కష్టకాలంలో కూడా జగన్ కు తోడుగా ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం ఆహార్నిశలు కృషి చేశారు విజయసాయి రెడ్ది. పార్టీకి చేసిన విశేష కృషిని.. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలకపాత్రపోషించిన విజయసాయి రెడ్ది పాత్రను గుర్తించి ముఖ్యమంత్రి,ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది విజయసాయిరెడ్డిని రాజ్యసభలో పార్లమెంటరీ నేతగా నియమించారు.విజయసాయి రెడ్డిని ఆ పదవీలో నియమిస్తున్నట్లు ఈ నెల 3న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి వైసీపీ అధినేతగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి నియమాకాన్ని అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని జగన్ కోరారు. ఆయా ప్రభుత్వ శాఖల కమిటీల అధికారులు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.