ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీనేతలు జగన్‌కు స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్ ప్రత్యేక కాన్వాయ్‌లో శారదా పీఠానికి చేరుకున్నారు. శారదాపీఠంలో వేదపండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అయితే గత సంవత్సరంలో ఇదే విశాఖ విమానశ్రయంలో వైఎస్ జగన్ అడ్డుకున్న పోలీసుల నేడు ముఖ్యమంత్రిగా తొలిసారిగా అదే విశాఖ విమానాశ్రయంలో రాజులా దిగాడు. ప్రతి ఒక్కరు జై జగన్ ..జై జగన్ అంటూ ఎయిర్ పోర్ట్ ప్రాంగాణం మొత్తం హోరెత్తింది.
