ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న సమీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో చోటు చేసుకున్న పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ధికశాఖలో జరిగిన వేల కోట్ల అక్రమ కేటాయింపులపై చర్చ జరుగుతుండగానే ఉన్నటత విద్యామండలిలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలిలో కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత మూడేళ్లుగా 18లక్షలు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయం తెలిసి జగన్ షాక్ అయ్యారట. ఉన్న త విద్యామండలిలో జరిగిన ఈ పరిణామం ప్రభుత్వానికి విస్మయం కలిగించింది. మొత్తం అధికారిక కార్యక్రమాల సందర్భంగా వాడిన డ్రైఫ్రూట్స్ కు ఖర్చు చేశారా లేక సొంత అవసరాల కోసం వాడి ఇలా బిల్లులు పెట్టారా అనేది తేలాల్సి ఉంది. అక్రమాలు జరిగినట్టు తేలితే సీఎం చర్యలు తీసుకునేందుకు సిద్దమవ్వనున్నట్టు తెలుస్తాయి.