ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే దేనిలోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు .కానీ ఆ “ఒక్క విషయం”లో మాత్రం అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ అంట .ఇంతకు ఏమిటి ఆ విషయం అంటారా ..అదే ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకే ఆటిజం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు .మెదడులోని సిగ్నలింగ్ వ్యవస్థలో ఉండే తేడానే అందుకు కారణం అని గుర్తించారు .
నలుగురు అబ్బాయిలలో ఆటిజం ఉంటె ఒక్క అమ్మాయిలో మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కనిపిస్తున్నాయని అమెరికా దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ లోవా పరిశోధకుడు టెడ్ ఎబుల్ తెలిపారు .అబ్బాయిలలో ఆటిజం లోపాలు ఎందుకు సంభవిస్తున్నయానే విషయం అర్ధం కావడం లేదని అన్నారు .నాడి వ్యవస్థ సంబంధ లోపాలు క్రియాశీలకంగా లేకపోవడం ,నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి లక్షణాలు అబ్బాయిలలో అధికంగా ఉన్నట్లు గుర్తించారు .
ప్రతి రెండు వందల మంది ఆటిజం బాధితులను గమనిస్తే ఒకరిలో ప్రత్యేకమైన క్రోమోజోమో లోని డీఎన్ఏలో లోపాలు ఉన్నట్లు తేలింది .అయితే ఎలుకలపై పరిశోదన చేసి ఈ విషయాన్నీ ధృవీకరించినట్లు ఆయన తెలిపారు .