Home / POLITICS / రేవంత్ పార్టీ మారడానికి ముహూర్తం ఖరారు …

రేవంత్ పార్టీ మారడానికి ముహూర్తం ఖరారు …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ నిన్న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు తిరిగివచ్చారు .

అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనవైపు వస్తోన్న ఆరోపణలను ఖండించలేదు .అంతే కాకుండా అవి నిజమే అన్నట్లు కూడా ఆయన మాట్లాడారు .అయితే రేవంత్ రెడ్డి వచ్చే నెల తొమ్మిదో తారిఖు లేదా డిసెంబర్ తొమ్మిదో తారీఖున టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు .

అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా కూడా ఈ వార్తలను సమర్ధించడం ఇక్కడ గమనార్హం .చూడాలి మరి రేవంత్ పార్టీ మారుతున్నారు అని వస్తోన్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందో ..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat