ఇటీవల నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రివర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సునామీను సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మరోవైపు ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ క్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర నూతన మంత్రి వర్గ విస్తరణ ఈ నెల ఎనిమిదో తారీఖున జరగనున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లు వెలగపూడిలోని సచివాలయం దగ్గర ఉన్న మైదానంలో జరుగుతున్నాయి.
ఆ రోజు ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ నూతన మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నూతన మంత్రులతో తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అయితే జగన్ నూతన టీమ్ లో జిల్లాల వారీగా వీళ్ళకు అవకాశమున్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.దాదాపు పదేళ్ళ తర్వాత అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ ప్రజలకు పరిపాలనను అందించడం కోసం .. దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా నిలవడం కోసం ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమర్ధులను,నమ్మకస్తులను కుల మతాలు ప్రాతిపదికన ఎంచుకున్నట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరి పదమూడు జిల్లాల నుండి ఎవరికి అవకాశముందో ఒక లుక్ వేద్దామా..?
వైసీపీకి చెందిన ప్రముఖ సీనియర్ నేతల సమాచారం మేరకు నూతన మంత్రులుగా
శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం),
ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట)
విజయనగరం జిల్లా: బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి),
కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం)
విశాఖపట్నం జిల్లా: గుడివాడ అమరనాథ్ (అనకాపల్లి),
గొల్ల బాబూరావు (పాయకరావుపేట)
తూర్పు గోదావరి జిల్లా: ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్
కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్),
పశ్చిమగోదావరి జిల్లా: ఆళ్ల నాని (ఏలూరు),
గ్రంథి శ్రీనివాస్ (భీమవరం).
కృష్ణా జిల్లా: కొడాలి నాని (గుడివాడ),
కొలుసు పార్థసారథి (పెనమలూరు)
మేకా వెంకట ప్రతాప అప్పారావు (నూజివీడు).
గుంటూరు జిల్లా: మర్రి రాజశేఖర్ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు)
ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి)
అంబటి రాంబాబు (సత్తెనపల్లి).
ప్రకాశం జిల్లా: బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు),
ఆదిమూలపు సురేశ్ (యర్రగొండపాలెం).
చిత్తూరు జిల్లా: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు),
భూమన కరుణాకర్‌రెడ్డి (తిరుపతి).
నెల్లూరు జిల్లా: మేకపాటి గౌతంరెడ్డి (ఆత్మకూరు),
రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి (కావలి)
ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి).
శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి),
కర్నూలు జిల్లా: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్)
అనంతపురం జిల్లా: అనంత వెంకటరామిరెడ్డి (అనంత అర్బన్)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
ఎం.శంకరనారాయణ (పెనుకొండ).
Post Views: 423