ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలుపుతూ లేఖ రాసారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాల అమలులో బాధ్యతాయుతమైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని పేర్కొన్నారు.. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జగన్ కు అభినందనలు తెలిపారు. వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో స్పందిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను.
తెలుగు ప్రజల అభివృద్ధికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. @ysjagan @YSRCParty #Jagan’ అని ట్వీట్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.. ట్విట్టర్ వేదికగా ఆయన ఒక సందేశాన్ని పోస్ట్ చేసారు. కొత్త ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు.. అలాగే మీ కొత్త మంత్రివర్గానికి కూడా నా శుభకాంక్షలు.. ఏపీ ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు అంటూ ట్విట్ చేశారు. అయితే గతంలో జగన్ ని రాహుల్ తల్లి సోనియా కేసుల్లో ఇరికించడం, అందుకు చంద్రబాబు సహకరించడం, చంద్రబాబుకు వెంకయ్య సలహాలివ్వడం మాకు గుర్తుంది.. ఇప్పుడు మీరు విషెస్ చెప్తుండడం కూడా మాకు గుర్తుంటుంది అంటూ వైసీపీ సోషల్ మీడియా వీరిపై విమర్శలు గుప్పిస్తోంది.