నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అతిరథుల సమక్షంలో కోట్ల మంది ప్రజల సాక్షిగా పంచభూతాలు దీవిస్తుండగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి,కుమార్తెలు హార్ష,వర్ష,తల్లి వైఎస్ విజయమ్మ ,సోదరి వైఎస్ షర్మిలతో కలిసి ఉదయం పదకొండు గంటల యాబై నాలుగు నిమిషాలకు తాడేపల్లిలోని తన ఇంటి నుండి విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు బయలు దేరారు. సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు వేదికకు చేరుకున్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేత పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు.
అయితే ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి జగన్ గతంలో ఎన్నడూ లేనివిధంగా తనచేతికి వాచ్ పెట్టుకుని కన్పించారు. అయితే ఈ వాచ్ ఎవరిచ్చారు. ఈ వాచ్ ఎంత ఖరీదు చేసిందో ఒక లుక్ వేద్దామా..?. అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ వాచ్ పెట్టుకుని ఉన్న సంఘటనలు మనం చూసే ఉన్నాము. అయితే ఆయన రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరూ ఊహించని స్థితిలో హెలిచాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో మృతులకు సంబంధించిన వస్తువులను వారి వారి బంధువులకు ఇవ్వడం అనవాయితీ.
అయితే వైఎస్సార్ మరణం వెనక కుట్ర ఉందని భావించిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీబీఐ విచారణను కొరారు.ఈ క్రమంలో సీబీఐ అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించి ఏవైన ఆధారాలు లభిస్తాయేమో అని ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో వైఎస్సార్ కు సంబంధించి అన్ని వస్తువులు కాలిబూడిదయ్యాయి. కానీ వైఎస్సార్ చేతికి ఉన్న వాచ్ లో కొన్ని భాగాలు ఉండటంతో వాటిని జగన్ కావాలని అడిగారు అని.. వాళ్లు ఇచ్చారు అని నెటిజన్లు అంటున్నారు. పాడైన ఆ వాచ్ ను బాగుచేయించుకుని తన తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఉంటుందని.. వాచ్ తన చేతికి ఉంటే తన తండ్రే తనతో ఉన్నట్లు ఉంటుందని ఎప్పుడూ లేని విధంగా జగన్ ఆ వాచ్ ను పెట్టుకున్నారని వాచ్ తో ఉన్న జగన్ ఫోటోను నెటిజన్లు షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అయితే ఈ వాచ్ వెనక ఉన్న అసలు కారణం ఎంటో జగన్ కే తెలియాలి అని మరికొంతమంది కామెంట్లు చేస్తోన్నారు.