ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది రేపు గురువారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్,సీపీఎం,సీపీఐ పార్టీ కార్యదర్శులను,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,ప్రధాని మోదీలను ఆహ్వనించిన సంగతి తెల్సిందే.
అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం రేపు జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారని సమాచారం. కానీ తన తరపున మాత్రం పార్టీకి చెందిన ప్రతినిధులను పంపించాలని బాబు నిర్ణయించారు.
అందులో భాగంగా రేపు గురువారం ఉదయం తరపున టీడీపీ తరపున ఇద్దరు నేతలను పంపించి తన తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి విషెష్ చెప్పాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు .అయితే ఇలా ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాని ఏకైక తొలి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారని విమర్శకులు అంటున్నారు.