అప్పట్లో అందం అంటే ఆమెది అనే వారు ఏవరిదో తెలుసా…అలనాటి సావిత్రిది.. ఇప్పట్లో అందం అంటే ఈమెది అంటున్నారు. ఆమేనే కీర్తి సురేష్. అందుకేనంటా సావిత్రి పాత్రకు ఆమెను నాగ్ అశ్విన్ సెలెక్ట్ చేసారు అలనాటి తార సావిత్రి జీవితకదా ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు . మంగళవారం కీర్తి పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు .
ఈ మూవీ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు . ‘ఆకాశవీధిలో అందాల జాబిలి ‘ . అంటూ ఆ ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది చిత్ర బృందం పాతకాలంనాటి ఆ ఫొటోలో కీర్తి సురేష్ కళ్ళు , నుదురు ,బొట్టు, చూడగానే అచ్చు సావిత్రిలానే అనిపిస్తుంది .. వైజయంతి మూవీస్ పతాకం ఫై తెలుగు ,తమిళం ,మలయాళం, భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు . సినిమాకు సంబంధించిన ఆమె లుక్ ను కూడా కీర్తి పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసారు