మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఐదేళ్ళు పాలనలో ఏమీ చేసింది లేదని ప్రజలే నిరూపించారు.బాబు పాలనలో ప్రజలు అందరు కూడా నష్టాల్లో కూరుకుపోయారు తప్ప ఎన్నడు లాబాలు అయితే చూడలేదు.ఒక్క రైతులే కాదు అన్ని శాఖలు సంబంధిన వారు ఆకరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడ్డారు.దీనికి ప్రతిఫలమే ఇప్పుడు చంద్రబాబు ఓటమని చెప్పాలి.మరీ ఇంత దారుణంగా ఓడిపోయాడంటే అర్ధంచేసుకోండి చంద్రబాబు ని ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారో.దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కరువు వల్ల నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి. జగనన్న ప్రభుత్వం వచ్చింది. రెయిన్ గన్ల ఉత్తుత్తి ప్రచారాలు కాకుండా కరువు నివారణకు శాశ్వత పరిష్కారాలు ఉంటాయి. సేద్యం పండుగలా మారే రోజులొచ్చాయి. ఇకపై మంచి నీటి సమస్య అనేది లేకుండా ఆయన ముందస్తు ప్రణాళికలు అమలు చేయిస్తారని విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.