ఏపీ ఎన్నికల్లో సంచల విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దరువు ఎండీ శుభాకాంక్షలు తెలిపారు.. జగన్ ప్రతిపక్షనేతగా జగన్ తన పాత్రకు, ప్రజలు అప్పగించిన బాధ్యతకు నూటికి నూరుశాతం న్యాయం చేసినట్టుగా ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటినుంచి దాదాపుగా పదేళ్లపాటు కరణ్ రెడ్డి జగన్ కు అండగా నిలబడ్డారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరణ్ రెడ్డి తన సంస్థలైన దరువు మీడియా, కరణ్ కాన్సెప్ట్స్ ల ద్వారా పార్టీకి విశేషంగా సేవలందించారు. ప్రతిపక్షపార్టీ గొంతుకగా దరువు నినదించింది. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రతీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని దరువు ప్రశ్నించింది. తాజాగా జగన్ విజయం పట్ల కరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు.