ఏపీలో వెలువడిన ఫలితాల తీరు చూస్తుంటే చంద్రబాబుకు చెంపపెట్టులా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు విధానాలు, వ్యవహార శైలి, అహంకారపూరిత వ్యాఖ్యలే ఘోర పరాజయానికి కారణాలుగా తెలుస్తున్నాయి. గతంలో నాయీ బ్రాహ్మణులు, ఆశా వర్కర్లు, విద్యార్ధులు, దళితులపై వివిధ సందర్భాల్లో నోరు పారేసుకున్న చంద్రబాబు అదే పంధాను రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగించారు. ప్రధానంగా ప్రత్యర్ధి వైసీపీ అధినేత జగన్ పై, తెలంగాణ ముఖ్యమంత్రిపై, ప్రధాని మోడిపై చంద్రబాబు ఉపయోగించిన భాష చాలా దారుణంగా కనిపించింది. వాడు, వీడు, ఎవడు అంటూ వివిధ సందర్భాల్లో జగన్, మోడి, కేసీఆర్ లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఎన్నికల ఫలితాలను చూసి పలువురు చంద్రబాబు అహంకారపూరిత వైఖరి వల్లే ఇంతటి దారుణమైన ఓటమి మూటగట్టుకున్నారంటూ అభివర్ణిస్తున్నారు.