చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోని దాదాపుగా అందరు మంత్రులు ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నారు. ముఖ్యంగా ఓట్ల శాతం కూడా భారీగా తేడా వస్తుండడం పట్ల ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందే అర్ధం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు సహా పార్టీ నేతలు, ఎంపీలు మాత్రం టీడీపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని చెప్పుకొచ్చారు. అలాగే మోడిని సైతం దింపుతున్నామని, యూపీయేతో కలిసి మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.
అయితే కేంద్రంలో తానే చక్రం తిప్పుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా దక్కించుకోలేకపోవడం ఆపార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతానంటూ బయల్దేరిన చంద్రబాబు కనీసం రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయారు. అలాగే కుప్పం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగిన చంద్రబాబు తన అసెంబ్లీ సీటు గెలిచేందుకు ఎంతో ఇబ్బంది ఎదుర్కోవాల్సివచ్చింది. ముఖ్యంగా చాలా రౌండ్లలో చంద్రబాబుకు ప్రత్యర్ధ వైసీపీ అభ్యర్ధి చంద్రమౌళి చుక్కలు చూపించారు.