వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారనే నమ్మకం నాకుంది,ఆయన గెలవాలనే కోరుకుంటున్న.ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారడం మనకు ఎంతో అవసరం.టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఐదేళ్ల అధికారంలో అంతా దుర్వినియోగం చేసారనే చెప్పాలి. పార్టీ నేతల అరాచకాలు కావొచ్చు..వాళ్ళు చేసిన అన్యాయాలు కావొచ్చు.వీరిపై పార్టీ ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా సపోర్ట్ చేసేవారు.ఇక జగన్ పరంగా చూసుకుంటే..పదేళ్ళు ఓర్పు, సహనంతో ప్రజల కష్టాలను తెలుసుకొని,నేనున్నాను తోడుగా అంటూ తాను చేసిన పాదయాత్రతో విశేష అనుభవాన్ని సంపాదించుకున్నారు.ఇవి చాలు జగన్ గెలవాలి అనడానికి.ఈసారి జగన్ సీఎం అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను.