గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత రాష్ట్రంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. కృంగి పోకుండా అలుపెరుగని యాత్ర చేపట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రజల మన్నలు అందుకున్నారు. ఈ ఐదేండ్ల కాలంలో ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకుని ముందుకు సాగారు. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేసింది. దీంతో ఎక్కడ చూసినా.. ఎన్నికల ఫలితాలపై ఎక్కడలేని క్రేజ్ మొదలైంది. ఇప్పటి ఎగ్జిట్ ఫోల్స్ మొత్తం వైసీపీ గెలుపుపై సర్వే రిపోర్టులు ఇస్తున్నాయి.
ఏపీలో వైసీపీ గెలుస్తుందని సోషల్ మీడియాలో విపరీతమైన టాక్ నడుస్తుంది.అంతేకాకుండా తమ పార్టీ అధినేత జగన్ సీఎం కావడం పక్కా అంటూ..సొంత పార్టీ నాయకులు చాలా నమ్మకంగా ఉన్నారు. జనాలకు అదే చెబుతున్నారు. జగన్ కూడా అంతే నమ్మకంగా కనిపిస్తున్నారు. ఈ సందర్బంగా జగన్..తన ఫేస్ బుక్ వేదికగా ఓ ఆసక్తికర పోస్టర్ ను పోస్ట్ చేశారు. రాజన్న సుపరిపాలనను తీసుకురావాలన్నదే తన సంకల్పమని చెప్పిన జగన్ దానికి సంబంధించిన ఫోస్టర్ రిలీజ్ చేశాడు.
ఫతిలాలు మొత్తం తమ వైపే అన్నట్లు జగన్ మొఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నవ్వుతూ ఫోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ‘ప్రజాపరిపాలనే సాగాలి’ అనే క్యాప్షన్ తో ఉన్న ఈ పోస్టర్ పై మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారని, వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటానని రాశారు.