బాలీవుడ్ హాట్ భామలు దీపిక పదుకొనే, కత్రినాకైఫ్ లతో హాటుగా.. ఘాటుగా ప్రేయాణానాలు నడిపిన రణబీర్ కపూర్… ఇద్దరికీ బాయ్ బాయ్ కూడా చెప్పేశాడు. ఇప్పుడు తాజాగా షారుఖ్ ఖాన్ రాయిస్ చిత్రం ఫేం మహిరాఖాన్‌తో ఎఫైర్ స్టార్ట్ చేశాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక ప్రైవేట్ రూమ్‌లో సిగరెట్లు కాలుస్తూ కనిపించిన ఈ జంట ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంలో మహిరా పై చాలా విమర్శలు వచ్చాయి. పొట్టి వస్త్రాలు ధరించడం, సిగరెట్ తాగి ఆచారాలు మంటగలుపుతోందని చాలా మంది విమర్శించారు.
ఇక ఈ విషయం పై తొలిసారిగా పెదవి విప్పిన మహీరా.. అది నా వ్యక్తిగత జీవితం. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి తిరగడం చాలా సాధారణం. అయినప్పటికీ ఈ సంఘటన ద్వారా చాలా మంచి గుణపాఠం నేర్చుకున్నా.. మీడియా ప్రతి చోట ఉంటుందని, వాళ్ల కళ్లుగప్పి తిరగడం కష్టమని నాకు అర్థమైందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వెర్నా అనే సినిమాలో నటిస్తోన్న మహిరాఖాన్.. విషయానికి వస్తే ఆమె పాకిస్తాన్ నటి. 2007లో ఆలి ఆస్కారిని పెళ్లాడింది. వీరికి ఒక కొడుకు పుట్టాడు. 2015లో ఇద్దరూ విడాకులు తీసుకొని విడివిడిగా జీవిస్తున్నారు.ీోబ