వరుస ఓటములు..పార్టీకి ముఖ్యనేతల గుడ్‌బై ….క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకునే పరిణామాలు కనిపిస్తాయి. పీసీసీ అధ్యక్షుడితోపాటు కార్యవర్గంలోనూ సమూల మార్పులు చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో భారీగా మార్పులకు ఇది సంకేతమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
త్వరలో తనను పదవి నుంచి తొలగించడం ఖాయమని తేలిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో టీపీసీసీ పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారని సమాచారం. ముందస్తు ఎన్నికల ఫలితాల తర్వాత తనను తప్పించాలని కోరుతూ ఆయన లేఖ రాసినట్టు తెలిసింది. ఉత్తమ్‌కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇస్తారనే ఉహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాతనే టీపీసీసీ అధ్యక్షపదవిపై అధిష్టానం దృష్టి పెట్టనున్నట్టు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.