ప్రముఖ లేడీ సింగర్ శ్రేయా ఘోషల్ కు ఘోర అవమానం జరిగింది. శ్రేయా ఘోషల్ సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో తనతో పాటు తెచ్చుకున్న మ్యూజిక్ పరికరాన్ని కూడా ఎయిర్ పోర్టుకు తెచ్చుకున్నారు. కానీ మ్యూజిక్ పరికరాన్ని విమానంలోకి తీసుకురావడానికి వీల్లేదని ఎయిర్ లైన్స్ సిబ్బంది శ్రేయాకు చెప్పారు.
సిబ్బందికి ఎంతగా చెప్పిన వినకపోవడంతో శ్రేయా తనతో తెచ్చుకున్న సంగీత పరికరాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్లారు. దీనిపై తన అధికారక ట్విట్టర్లో స్పందిస్తూ విలువైన వాయిద్య పరికరాలు ఉంటే సింగపూర్ ఎయిలైన్స్ విమానంలోకి ఎక్కనివ్వదేమో అంటూ ఆమె ఎద్దేవా చేసింది.
తనకు గుణపాఠం నేర్పినందుకు ధన్యవాదాలు అంటూ శ్రేయా ఘాటుగా స్పందించారు.అయితే శ్రేయా ట్వీట్ కు సింగపూర్ ఎయిర్ లైన్స్ స్పందిస్తూ”ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని… తమ సిబ్బంది మీతో ఏమన్నారో “వివరంగా తెలియజేయమని కోరింది.