తాజాగా కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నిరాడంబరంగా రాజకీయాలతో సంబంధంలేకుండా జరగాల్సినా ఎక్కడికక్కడ జగన్ కాన్వాయ్ వెంట, కాన్వాయ్ వెళ్లే దారులనిండా జనం బారులు తీరుతున్నారు. ఎక్కడా ప్రసంగాలు లేకపోయినా జనం భారీస్థాయిలో కాన్వాయ్ వెళ్లే ప్రదేశాలకు చేరుకోవడం చూస్తుంటే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఢీకొడుతున్న నాయకుని కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అర్ధమవుతోంది. టీడీపీ పాలన తరువాత వాటికి ప్రత్యామ్న్యాయంగా జగన్ పాలన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే రంజాన్ సందర్భంగా పులివెందులలోని వీజే ఫంక్షన్ హాలులో మైనార్టీ సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి జగన్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.
రంజాన్ మాసం కుటుంబాలను, పొరుగువారిని, సమాజాన్ని మరింత చేరువ చేస్తుందని, రంజాన్‌లో శాంతి, సహనంతో ఉండాలని ప్రజలు కోరుకుంటారని పేర్కొన్నారు. అయితే ముస్లింలు కూడా జగన్ ను ఆప్యాయంగా ఆదరించారు. జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా కుటుంబంతోనే ప్రశాంతంగా ఉంటున్నారు. అయినా జగన్ ను రాష్ట్రప్రజలెవ్వరూ మరిచిపోవడం లేదు. ఆయనకు సంబంధించిన ప్రతీ వార్తను ఆసక్తిగా చూస్తున్నారు. ఎడ్యుకేటెడ్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు. 2014 వరకు టీడీపీ తమకుఎదురే లేదనుకున్నా ప్రజల్లో జగన్ నాయకత్వం పట్ల నమ్మకం కలగడం, టీడీపీ ప్రజావ్యతిరేక పాలన, చంద్రబాబు అండ్ కో స్వయంకృతాపరాధాలతో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఓటుబ్యాంకు కోల్పోయింది. టీడీపీ నియంతృత్వ పోకడలకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపే చూసారు.