Home / MOVIES / అవ‌కాశం ఇస్తాన‌ని.. ప‌క్క పంచుకోమ‌న్నాడు..!

అవ‌కాశం ఇస్తాన‌ని.. ప‌క్క పంచుకోమ‌న్నాడు..!

సినిమా ఇండ‌స్ర్టీలో రాణించాలంటే అంత ఈజీ కాద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందులోనూ ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుంటే ఇండ‌స్ర్టీలోకి అడుగుపెట్ట‌డం కూడా గ‌గ‌న‌మే. అంతేకాదు… చిన్న చిన్న క్యారెక్ట‌ర్ట్స్ చేసుకునే వారి ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణం అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది యంగ్ సింగ‌ర్ ప్ర‌ణ‌వి. తెలుగు పాటలు పాడ‌టంలో ప్రణవికి ఓ ప్రత్యేకత ఉంది.
ఆ ప్రత్యేకతే శ్రోతలను మంత్ర ముగ్ధులను చేస్తుంది. దీంతో ప్రణవిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తుంటాయి.

ఈ ఇంట‌ర్వ్యూలోనే, తాను సినిమా ఇండ‌స్ర్టీలోకి అడుగుపెట్టిన రోజుల్లో ఎదురైన ఓ చేదు అనుభ‌వం గురించి చెప్పుకొచ్చింది.
తాను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ సినిమాకి పాట పాడటానికి వెళ్లాననీ, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి తనతో అసభ్యంగా మాట్లాడాడని, సినిమాల్లో పాటలు పాడాలనుకుంటే తనతో వుండాలంటూ ఆయన అనడంతో, చెప్పుతీసుకుని కొడతానని వార్నింగ్ ఇవ్వ‌డంతో అక్క‌డ్నుంచి అత‌ను చ‌ల్ల‌గా జారుకున్నాడ‌ని తెలిపింది. త‌న‌కు సింగ‌ర్‌గా అవ‌కాశాలు రాక‌పోయినా ప‌ర్వాలేద‌ని, అలా వ‌చ్చే అవ‌కాశాలు త‌న‌కి అవ‌స‌ర‌మే లేదంటూ చెప్పుకొచ్చింది. తన ఎదురుగా ఆడపిల్లలను ఎవరైనా ఏమైనా అంటే తాను చూస్తూ ఊరుకోననీ .. ధైర్యంగా వెళ్లి వాళ్లను కొట్టేస్తానని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat