భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నారా..?. ప్రస్తుతం దేశమంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నరేందర్ మోదీ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా ఒక ప్రముఖ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వూ లో మాట్లాడుతూ”దేశ ప్రజలు డిజిటల్ వైపు పరుగులు పెట్టాలని” పిలుపునిచ్చారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ”1987లోనే తాను డిజిటల్ కెమెరాను కొన్నాను. 1998కాలంలోనే నేను ఈ మెయిల్స్ వాడటం అలవాటు చేసుకున్నాను”అని అన్నారు. అయితే మొదటి డిజిటల్ కెమెరా 1987లో నికాన్ నుంచి వచ్చింది. కమర్శియల్ ఈ మెయిల్స్ 1990-95మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చాయి.
కానీ మోదీ ఎలా డిజిటల్ కెమెరాను కొన్నారు. ఎలా ఈమెయిల్స్ వాడారు అని నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తోన్నారు. అయితే అల్రేడీ ప్రపంచ పటంలో ఉన్న హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టాను అని ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలా కలలు కంటున్నారో అదే విధంగా డిజిటల్ కెమెరా,ఈమెయిల్స్ లేకుండా ఉన్నట్లు భ్రమించి తాను వాడినట్లు కలలు కంటూ మోదీ బాబు బాటలో నడుస్తున్నారు అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.