తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హన్మంత్ రావుపై దాడి జరిగింది. రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన అఖిలపక్షాల నిరసన దీక్షలో వి హన్మంత్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ కుంతీయ రాకముందే స్టేజీపైకి వచ్చారని కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కార్యదర్శి నగేశ్ ను స్తేజీపై నుండి దిగిపోవాలని విహెచ్ గొడవకు దిగారు.
అంతటితో ఆగకుండా వీహెచ్ నగేష్ ను కిందకి తోసేశారు. దీంతో ఆగ్రహానికి గురైన నగేష్ అనుచరులు వి హన్మంత్ రావుపైకి దాడికి దిగారు. తోపులాటలో వి హాన్మంత్ రావు కింద పడిపోయారు. అయితే ఇందిరా పార్క్ లోని జరుగుతున్న ధర్నా వేదికపై ఉన్న కుర్చీ కోసం ఈ కొట్లాట జరగడం గమనార్హం