టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూర్యాపేట జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చింతలపాలెం మండలం పిట్ల నాయక్ తండాలో పర్యటిస్తుండగా ఉత్తంకుమార్ రెడ్డి నిటీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మా గ్రామానికి ఏం చేశావ్ అంటూ నిలదీశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలతో గొడవకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు