తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లులో పూజా హెగ్డే ఒకరు.ఆమె అందం, నటనతో మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.ఒక లైలా కోసం చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన పూజా..ఆ తరువాత వరుణ్ తేజ్ సరసన ముకుందలో నటించింది.కాని ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయాయి.అనంతరం 2017 లో అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం మరియు బెల్లంకొండ శ్రీనివాస్ తో సాక్ష్యంలో నటించగా అవి కూడా ఫ్లాప్ అయ్యాయి.
ఇక చివరిగా యంగ్ టైగర్ ఎన్టీఅర్ సరసన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటించగా బాక్సాఫీస్ దగ్గర సినిమా సూపర్ హిట్ అయ్యింది.చెప్పాలంటే కెరీర్ లో పూజా హెగ్డే కు ఇదే పెద్ద హిట్ అని చెప్పాలి.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరసన మహర్షి సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు వరుణ్ తేజ్ వాల్మీకి చిత్రంలో ఒక రోల్ కి తనని అడగగా..15రోజులకు రూ.2కోట్లు అడిగిందట.దీనికి వాల్మీకి యూనిట్ ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.