ఏపీలో మరో ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవ్వబోతుంది. ఇటీవల సార్వత్రిక మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగి .. ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల అరవై పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ”గతంలో అరవై శాతం రిజర్వేషన్లు అమలు చేశాం.. ఇప్పుడు యాబై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు. రిజర్వేషన్లపై మే 23 తర్వాత ఏర్పడనున్న సరికొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తామని “ఆయన తెలిపారు..