చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.అసలు ఈ టీమ్ కి అంత పేరు రావడానికి గల కారణం కూడా ధోనినే.నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై 80పరుగుల భారీ తేడాతో చెన్నై గెలిచింది.ఇందులో కీలక పాత్ర ధోనిదే.ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ.బౌలర్స్ ధాటికి చెన్నై ఓపెనర్స్ పవర్ ప్లే అసలు స్కోర్ నే లేదు.ఆ తరువాత వచ్చిన రైనా స్కోర్ ని ముందుకు నడిపించాడు.అనంతరం వచ్చిన ధోని తనదైన శైలిలో బౌలర్స్ కి చుక్కలు చూపించాడు.దాని ఫలితమే స్కోర్ 20ఓవర్లలో 179కి చేరింది.ఆ తరువాత ఢిల్లీ ప్లేయర్స్ ధోని మైండ్ గేమ్ దెబ్బకు తట్టుకోలేకపోయారు.ఐన ఢిల్లీ ఆసలు మొత్తం కెప్టెన్ పైనే పెట్టుకున్నారు.కాని ధోని చక్కటి స్టంపింగ్ తో ఢిల్లీ ఆసలు మీద నీళ్ళు జల్లాడు.ధోని మరోసారి తన స్టంపింగ్ తో యావత్ ప్రపంచాన్ని తన పక్కకి తిప్పుకున్నాడు.క్రికెట్ విశ్లేషకులు ధోని లాంటి కీపర్ మనకు ఇంక లేనట్టే అంటున్నారు.