ఏపీలో ఈ నెల 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈరోజు అమెరికాలోని న్యూ జెర్సీలో ఎన్నారైలతో మీటింగ్ సమావేశంలో మాట్లడుతూ చంద్రబాబు లక్షల కోట్ల అవీనీతి చేశాడాని అందుకే దారుణంగా ఓడిపోవడం ఖాయం అన్నారు. ఇంకా ఏమన్నారంటే నిత్యం టీడీపీ నేతల అరచాకలను ఎండగడుతూ అమెరికా నుండి ఆంద్రాలో ఉన్న బంధువులకు , స్నెహితులకు పోన్ ద్వారా తెలియజేసి వైసీపీకి ఓటు వెయమని చెప్పిన ఎన్నారైలకు దన్యవాదములు తెలిపారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కు రాజకీయ అంతం అనేది ఏపీ ప్రజల తీర్పు అని స్ఫష్టంగా తెలుస్తుంది అన్నారు. అంతేకాదు మే23 తేదిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 120 నుండి 130 సీట్లు గెలుస్తుందని ఇప్పటికే అన్ని సర్వేలు, అంతకు మించి ఏపీ ప్రజల ఆకాంక్ష వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆర్కే అన్నారు. పార్లమెంట్ స్థానల్లో 20 సీట్లు వైసీపీ గెలవబబోతుందని అన్నారు.
