వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ నాయకులు,ఎమ్మెల్యేల పై మండిపడ్డారు.టీడీపీ నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా టీడీపీ నాయకులకు సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారని అన్నారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికైనా సీఎస్ తక్షణం కొరడా జుళిపించాలి.తప్పు చేసింది అధికార పార్టీ ఐన సరే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఇప్పుడే ఎలా దోచేస్తుంటే ఈ ఐదేళ్ళు ఎంత సొమ్ము నొక్కేసి ఉంటారో మీరే అర్ధం చేస్కొండి.
టిడిపి నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలి స్తూనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. సిఎస్ తక్షణం కొరడా జుళిపించాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 30, 2019