Home / SLIDER / పార్టీ మార్పుపై రేవంత్ అనుచరవర్గం క్లారీటీ ..!

పార్టీ మార్పుపై రేవంత్ అనుచరవర్గం క్లారీటీ ..!

తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఓటుకు నోటు కేసు నిందితుడు ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరనున్నారని ప్రస్తుతం వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత రెండు రోజులుగా రేవంత్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రస్తుతం ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.

అయితే పార్టీ మారుతున్నారు అనే వార్తలపై రేవంత్ అనుచరవర్గం క్లారిటీ ఇచ్చారు .వారు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని కలుస్తున్నానంటూ వస్తున్న వార్తలు నిజమే . కానీ రేవంత్ పార్టీ మారే అవకాశమే లేదని టీడీపీలో కొనసాగుతారని ఆయన వర్గీయులు తేల్చిచెప్పారు.

అయితే కాంగ్రెస్ పార్టీలో చేరితే.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని ప్రకటించే అవకాశముందని ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతోందన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat