ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో ఇండియా రెండో స్థానంలో ఉండగా చైనా మొదటి స్థానంలో ఉంది.మన ఇండియా పరంగా చూసుకుంటే..దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించే రవాణా సౌకర్యాలలో భారత దేశం మంచి ప్రగతిని సాధించింది.రోడ్లు, ట్రాఫిక్ రూల్స్ విషయానికి వస్తే మనదేశంలో జనాలు కొంతమంది రూల్స్ పాట్టిస్తారు.కొందరు రూల్స్ కి వ్యతిరేఖంగా నడుచుకుంటారు.ఇదే పరిస్థితి చైనాలో కూడా ఉంది.అయితే అక్కడి ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ పెట్టింది.అదేమిటి అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడకుండా అడ్డదిడ్డంగా రోడ్డు దాటితే ఆ సమయంలో వాళ్ళ మీదకు నీరు పడుతుందట.అదే రూల్స్ పాటిస్తూ సిగ్నల్ పడ్డాక రోడ్డు దాటితే నీరు పడడం ఆగుతుంది.ఇది ప్రస్తుతం అమల్లో ఉంది.దీంతో అక్కడి జనం రూల్స్ తప్పనిసరిగా పాటిస్తారు.