కమెడియన్ అలీ చిన్న వయసులోనే సినిమాల్లో నటించాడు.అయితే కమెడియన్‌గా ఉన్న ఆలీని దర్శకుడు ఎస్వీ.కృష్ణారెడ్డి హీరోగా పరిచయం చేస్తూ ‘యమలీల’ చిత్రం చేసారు.ఇది కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా బ్యానర్‌పై కే అచ్చిరెడ్డి నిర్మించడం జరిగింది.ఈ ఏప్రిల్ 28 తేదీతో ఈ చిత్రం ద్విగ్విజయంగా 25సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఇందులో తల్లీ కొడుకుల ప్రేమాప్యాతలు చక్కగా చూపించడంతో ప్రేక్షకుల మదిలోకి వెళ్ళింది.దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది.
తల్లిని దేవతలా పూజించే కొడుకు పాత్రలో అలీ నటన అద్భుతం అని చెప్పొచు.ఈ సెంటిమెంట్ చివరిదాకా ఉంటుంది మధ్య మధ్యలో కామెడీ కూడా పండిస్తారు.ఈ చిత్రంలో యమధర్మరాజు గా కైకాల సత్యనారాయణ,చిత్ర గుప్తుడుగా బ్రహ్మానందం, తోట రాముడుగా తనికెళ్ళ భరణి నటించగా వీరి నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే ఆలీని హీరోగా పెట్టడంపై చాలా విమర్శలు చేసారు,కాని చిత్రం విడుదల అయిన తరువాత అందరు నోళ్ళు మూసుకున్నారు.
ఈ సినిమాలో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ సూపర్ స్టార్ కృష్ణ..ఆయన ‘జూంబారే జుజుంబారే..’ పాటకి వేసిన స్టెప్పులు సినిమాకే పెద్ద హైలెట్ అయింది.మొత్తానికి అన్ని పాత్రలు ఈ చిత్రానికి మంచి విజయానికి పునాది వేసాయి.