పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట నివాసంలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో ఎందరో కార్యకర్తల కష్టం, శ్రమ ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం పార్టీ కృషిచేస్తదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం సంతోషకరమని పేర్కొన్నారు.
టిఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/MsoP5cC0tn
— Harish Rao Thanneeru (@trsharish) April 27, 2019