వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మహర్షి.ప్రస్తతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఈవెంట్ మే 1వ తేదిన చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ ఒక స్పెషల్ కూడా ఉంది ఎందుకంటే దీనికి ముఖ్య అతిధులుగా టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది.
తెలుగు ఇండస్ట్రీ లో వీరి ముగ్గురి మంచి స్నేహం ఉందని అందరికి తెలిసిందే.వీరిలో ఎవరి సినిమా రిలీజ్ ఐన విషెష్ చెప్పుకుంటారు.మహేష్ బాబు రీసెంట్ గా నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఎన్టీఅర్ తో పాటుగా రామ్ చరణ్ రావడం…ఒకే చోట ముగ్గురు హీరోలు కలవడం అభిమానులకు పండగేనని చెప్పుకోవాలి.
ముగ్గురు హీరోలు కలుస్తున్న ఇంత పెద్ద ఈవెంట్ కు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వేదిక కానుంది.అంతే కాకుండా మహేశ్ బాబు కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.