దేశంలో ఉన్న 543పార్లమెంట్ స్థానాలకు దశలు వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రెండు దశల్లో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా రేపు మంగళవారం దేశ వ్యాప్తంగా మూడో దశలో భాగంగా మొత్తం నూట
పదహారు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ విడతలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో 26,కేరళలో 20,గోవాలో 2,దాద్రా నగర్ హవేలీలో 1,డయ్యా డామన్ లో 1,అస్సాంలో 4,బిహార్ లో 5,చత్తీస్ గఢ్ లో 7,జమ్మూ కాశ్మీర్లో 1,కర్నాటకలో 14,మహారాష్ట్రలో 14,ఒడిశాలో 6,ఉత్తరప్రదేశ్ లో 10,పశ్చిమ బెంగాల్ లో 5ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది..
