సిద్దిపేట నియోజకవర్గం చిన్నకొడుర్ మండలం చెర్ల అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు TRSV లో పనిచేస్తు.. ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమటి రెడ్డి రమాకాంత్ కి ఎంపిసి లో 969/1000 , అదే గ్రామానికి చెందిన వరుకోలు నవీన్ సిద్దిపేట పవిత్ర జూనియర్ కళాశాల లో చదువుతు సీఈసీ లో 972/1000 లో వచ్చాయి.. TRSV లో పని చేస్తూ..ఇటు పార్టీలో సేవ చేస్తు.. అటు చదువులో మంచి మార్కుల తో ప్రతిభ కనబరిచినందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు.. భవిష్యత్ లో ఉన్నత చదువులో రాణించాలని ఆకాంక్షించారు.. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు..