బాహుబలి కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఖాతా తెరిచి ఇన్ని రోజులు ఐన సరే ప్రభాస్ ఒక్క ఫోటో కూడా ఇంక పోస్ట్ చెయ్యలేదు.అయినప్పటికీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలకు చేరింది.మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాహుబలి’ చిత్రంలోని ఓ స్టిల్‌ను పోస్ట్ చేసాడు ప్రభాస్.తన ప్రొఫైల్ పిక్చర్‌గా కూడా అదే పెట్టుకున్నారు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తను ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సాహో..కాబట్టి ఇందులో స్టిల్ ఏదైనా పోస్ట్ చేస్తారని అందరు అనుకున్నారు..కాని అందరిని సర్‌ప్రైజ్ చేస్తూ ‘బాహుబలి’ స్టిల్‌ను పోస్ట్ చేసారు.అయితే ఈ అకౌంట్ ఇంకా వెరిఫైడ్ కాకముందే ఈ ఫొటోకు రెండు లక్షల నలభై ఏడు వేల లైక్‌లు రావడం విశేషం.ఈ చిత్రంతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు.ఇప్పటికే తన ఫేస్‌బుక్ ఫాలోవర్స్ పది మిలియన్లకి చేరిన విషయం అందరికి తెలిసిందే.