గత ఏడాది సెప్టెంబర్ 28న కల్యాణ్ జి గోగాన దర్శకత్వంలో అశిశ్ గాంధీ, అశిమా నర్వల జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాటకం’. ఈ చిత్రాన్ని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాగా సాయి కీర్తిక్ సంగీతం అందించారు.అయితే డైరెక్టర్ కల్యాణ్ జి, నటుడు అశిశ్ గాంధీకు ఇది మొదటి చిత్రం కాగా..తమ మొదటి సినిమాలోనే హిట్ టాక్ అందుకున్నారు.
హీరోగా అశిశ్ చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మాత్రం మంచి ఫలితాన్నే ఇచ్చింది. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. అశిశ్ గాంధీ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడు కల్యాణజి గోగాన రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కథలో ముఖ్యమైన కొన్ని కీలక సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రానికి గాను “తీస్ మార్ ఖాన్” అని నామకరణం చేసారు.ఈ చిత్రం లో హీరో అశిశ్ గాంధీ స్టూడెంట్ గా,మాస్ స్టైల్ లో కనిపిస్తారని తెలుస్తుంది.అయితే చిత్రం పోస్టర్ చూస్తే ఎవరికైనా ఇది సూపర్ హిట్ అని అర్ధమవుతుంది.దీంతో డైరెక్టర్ కల్యాణ్ జి గోగాన ఖాతాలో మరో హిట్ పడినట్టే.