Home / ANDHRAPRADESH / ఇది పాటిస్తే జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం పక్కా …

ఇది పాటిస్తే జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం పక్కా …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనకు బాగా కలిసొచ్చేదేనని రాజకీయ పండితులు అంటున్నారు. పాదయాత్ర అనేది జగన్‌ ఆశ్రయించిన ఒక మంచి మార్గమని.. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుంటారనే దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి వుంటాయి.టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,సీఎం నారా చంద్రబాబు నాయుడు సర్కారుపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఆయన నేరుగా తన కళ్లు, తన చెవులతో ప్రజలనుంచి తెలుసుకుంటే.. తన పోరాటమార్గాన్ని నిర్దేశించుకోవడంలో ఆయనకు పరిణతి పెరుగుతుంది.

అప్పటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కూడా తన పాదయాత్రకు ముందు… తరువాత చాలా భిన్నమైన పరిణతిని కనబరిచారనే విషయం తెలిసిందే. ఈ రకంగా జగన్ పాదయాత్రను వినియోగించుకోవాలని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే.. నవంబర్ 2 నుంచి పాదయాత్రను ప్రారంభించి, రాష్ట్రమంతటా కాలినడకన తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారు.

రాష్టంలో 50 శాతానికి పైగా జనాభా ప్రాతినిధ్యమున్న బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతి, అందుతున్న సంక్షేమ పథకాలు, తదుపరి దశలో తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై వివిధ బలహీన వర్గాల సంఘాల నేతలతో జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా బీసీలకు అండగా వైకాపా ఉంటుందన్న భరోసాను కల్పించే దిశగా బీసీ డిక్లరేషన్‌ను సైతం వైకాపా రూపొందించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదే సమయంలో నేతల సూచనలపై రూట్ మ్యాప్‌లో చేయాల్సిన మార్పులపైనా నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. పాదయాత్ర ప్రారంభించే లోపు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలతోనూ జగన్ సమావేశం అవుతారని తెలుస్తోంది. అంతేగాకుండా.. అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సేకరించడమే జగన్ లక్ష్యమని, పాదయాత్రకు ఈ సమావేశం ఉపకరిస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat