తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా దాదాపుగా ఐదున్నర కోట్లు.. ఇందులో ఓటర్లు సుమారుగా 4కోట్లమంది.. అయితే అత్యంత నికార్సుగా సర్వే చేసే CPS వేణుగోపాల రావు ఏకంగా మూడు లక్షల, నాలుగు వేల మూడు వందల ఇరవైమూడు మందిని సర్వే చేసారు (3,04,323).. ఇంత ఎక్కువమందితో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఎవరూ సర్వే చేసి ఉండరు.. కచ్చితమైన ఫలితాలకోసం ఈ విధంగా సర్వే నిర్వహించి ఉండొచ్చు.. అయితే వేణుగోపాలరావు సర్వే ఫలితాలు ఈ విధంగా వచ్చాయి. 2006 నుంచి 2009 మధ్య వైఎస్సార్ కు, 2016 నుంచి కేసిఆర్ కు వేణుగోపాల రావు సర్వేలు చేస్తున్నారు.. గత తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వే తప్పు TRS కు 94 స్థానాలు వస్తాయని చాలెంజ్ చేసి మరీ వేణుగోపాల రావు చెప్పారు అనంతర పరిణామాలతో TRS కు 88 సీట్లు వచ్చాయి..
YCPకి.. 121 -130 MLA సీట్లు , 21 MP సీట్లు, 48 .1 శాతం ఓట్లు వస్తాయట..
TDP కి.. 45 -54 MLA సీట్లు , 4 MP సీట్లు , 40 .1 శాతం ఓట్లు వస్తాయట..
JSP :1 -2 MLA సీట్లు మాత్రమే వస్తాయట.. 8 శాతం ఓట్లు వస్తాయట..
ఇందుకు ప్రధాన కారణాలు కూడా వెల్లడించారు.
చంద్రబాబు పాలనలో కేవలం కమ్మోళ్లు అందులోనూ పెద్దవాళ్లే బాగుపడ్డారనే ఫీలింగ్ ప్రజల్లో ఉండడం..
పవన్ కు వచ్చే కొన్ని ఓట్లు కూడా ఉభయ గోదావరి, విశాఖ జిల్లా నుంచే వస్తాయని అంచనా.. భీమవరం కంటే గాజువాకలో పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువట..
గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది.. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మకపోవడం టీడీపీకి పెద్ద మైనస్..
కొత్తగా ఇప్పుడు బీసీలలో చాలా మార్పు వచ్చింది.. వారంతా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తుండడం గమనార్హం.
కేసిఆర్ మోడీలను తిట్టడం చంద్రబాబుకు కలిసిరావట్లేదు.. ప్రజలు పట్టించుకోవడం లేదు.. కారణం కేసీఆర్, మోడి ఎవరి పని వారు చేసుకుంటూ ఉండడమే..
ఇక జగన్ విషయానికొస్తే పూర్తిస్థాయి పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగారు. చిన్నవయసులోనే ప్రతీ ప్రజాసమస్యపై అవగాహన పెంచుకన్నారు.