రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ గతంలో టీడీపీ తీవ్ర ప్రభావం చూపి ఎక్కువ స్థానాలు గెలిస్తే ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలివనుందనే అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో వైసీపీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకు చంద్రబాబు జనసేనతో ఇక్కడ ఫోకస్ పెట్టించినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు మరింత పగడ్బందీగా ముందుకెళ్తున్నారు. నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లోని నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసారు. భీమవరం ప్రజలు మాత్రం పవన్ గాజువాక, భీమవరంలో గెలిస్తే ఎక్కడ రాజీనామా చేస్తాడో చెప్పి ఓట్లు అడగాలని ప్రశ్నిస్తున్నారు. ఉండిలోనూ పీవీఎల్ ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ఈ క్రమంలో ఉండి వైసీపీలో చేరికలు ముమ్మరం అయ్యాయి. సీనియర్ నాయకుడు గలావిల్లి ధనుంజయ ఆద్వర్యంలో నవమణిరాజు, ఆయన సోదరుడు చిన్నా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నవమణిరాజు సోదరులకు పీవీఎల్, కృష్ణుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇంతకాలం వైఎస్సార్ కుంటుంబానికి అభిమానులుగా పార్టీకి సపోర్ట్ చేసిన వీరు ప్రత్యక్షంగా పీవీఎల్ కు మద్దతు పలికారు. రాజన్నరాజ్యంకోసం శ్రమిస్తామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే తన అభిలాష అని పీవీఎల్ అన్నారు. నవమణిరాజు చేరికతో ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, చెరువుగట్టుపాలెం, మహదేవపట్నం, వాండ్రం గ్రామాలలో తన బంధువులు, అనుచరులతో కలిసి పార్టీకోసం శ్రమించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవడంతో పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
