మహాసేన.. దళిత సమస్యలపై వేగంగా పోరాడే యువశక్తి.. ప్రపంచవ్యాప్తంగా మహాసేన టీంలతో కలిసి ఇప్పటికే వందలాది సమస్యలను పరిష్కరించారు. అయితే ఇప్పుడు మహాసేన రాజకీయంగానూ ముందుకెళ్తోంది.. తాజాగా దళిత పోరాట నాయకుడిగా పేరుగాంచిన జీవీ హర్షకుమార్ టీడీపీలో చేరికను మహాసేన జీర్ణించుకోలేకపోయింది. ఆయనను వైసీపీలోకి రావాలని ఆహ్వానించింది.. హర్ష కుమార్ తో చేయించబడ్డ తప్పును క్లారిటీగా వివరించారు రాజేష్.. ఈ క్రమంలో మహాసేన వ్యవస్థాపకుడు రాజేష్ టీడీపీ, జనసేన కుట్ర రాజకీయాలపై రాసిన పోస్ట్ యధాతధంగా..
ఒక ప్రముఖపార్టీ మహాసేనకి 20 MLA సీట్లు ఇస్తామంటే మేము కలవలేదు.. కారణం వారు ఇస్తానన్నది మామీద ప్రేమతోకాదు YCP ఓట్లు చీల్చడానికని మాకు తెలుసు..
మరొక పార్టీ మహాసేన వారికి మద్దతిస్తే ఖర్చుకి డబ్బులిచ్చి అమలాపురం MP సీటు ఇస్తామన్నారు. కానీ మేము ఒప్పుకోలేదు కారణం ఒక MP జాతి సమస్యలని తీర్చలేడని మాకుతెలుసు..
అందుకే ఏ పదవీ హామీ ఇవ్వకపోయినా ఖర్చుకి డబ్బులివ్వకపోయినా మా సమస్యలు తీరుస్తానని జగన్ గారు ఇచ్చిన హామీలకోసం 13 జిల్లాల్లోనూ మద్దతు తెలియజేశాం.. ప్రచారం కూడా మొదలుపెట్టాం కారణం మహాసేన వచ్చింది స్వంత ప్రయోజనాలకోసం కాదు జాతిసమస్యలు తీర్చడంకోసం..
అసలు విషయానికొస్తే.. మన ఇంట్లో కుర్రవాడు పరీక్ష హాల్ లో స్లిప్ రాసి దొరికేసి డిబార్ అయ్యాడని తెలిస్తే విపరీతమైన కోపం వస్తుంది. వాడ్ని చావగొడతాం..
కానీ వేరేవాడు స్లిప్ పెట్టి స్కాడ్ రావడం చూసి మనవాడిదగ్గరకు విసిరేసాడు.. అది మనవాడిదే అనుకుని డిబార్ చేస్తే మనకి జాలి.. ప్రేమా కలుగుతాయి.. హర్షకుమార్ గారి విషయంలో అదే జరిగింది..
ఆయనకీ నాకూ పెద్దగా పరిచయం లేకపోయినా దళితనాయకుడిగా ఆయనంటే నాకు గౌరవం.. నేనంటే ఆయనకి ఇష్టం… గత కొంతకాలం క్రితం హర్షకుమార్ గారి అబ్బాయి శ్రీరాజ్ గారినుండి నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. కానీ అప్పుడు నేను తెలంగాణాలో చర్చ్ విషయంలో సమస్య వుంటే అక్కడ వున్నాను.. తర్వాత కొన్నిరోజులకి మరొక సారి ఫోన్ చేసి ఆహ్వానించారు అప్పుడు కూడా వేరే ప్రాంతంలో వుండటం వలన వెళ్ళలేకపోయాను. మూడవసారి హర్షకుమార్ గారు SC ST చట్టంకోసం ప్రెస్ మీట్ పెట్టడానికి పిలిచారు.. మేము వెళ్ళాం.. హర్షన్న మమ్నల్ని సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళటీంకి చాలా గొప్పగా పరిచయం చేశారు. ప్రెస్ మీట్ అనంతరం మేము వచ్చేశాం.. ఆ ప్రెస్ మీట్ ని ఫేస్ బుక్ లో చూసి చాలామంది కోనసీమప్రాంత మహాసైనికులు ఫోన్ చేసి నేను హర్షన్నతో కలవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు.. మహాసేనలో ఉన్నవారి నిర్ణయానికి నేను ఖచ్చితంగా కట్టుబడివుంటాను.. సరే మరోసారి ఇలా జరగదులే అని మావాళ్ళకి మాటిచ్చాను. కానీ హర్షన్న అంటే నాకు ఎప్పుడూ గౌరవమే..
కొంతకాలం తరువాత శ్రీరాజ్ గారు సిరింగి రత్నకుమార్ గారి అబ్బాయి బర్తడే ఫంక్షన్ లో కలిసారు.. నాకోసమే ఆ ఫంక్షన్ కి వచ్చినట్లు చెప్పారు.. మనం రాజకీయంగా కలిసి ముందుకెళ్దాం అని అన్నారు.. కాపు దళిత ఐక్యతపేరుతో హర్షన్నా ముద్రగడ గారూ కలిసి ప్లాన్ చేస్తున్నారని తెలిపారు.. దళితుడు ముఖ్యమంత్రి అభ్యర్ధి అయితే నేను మహాసేన నుండి మద్దతిస్తాను అన్నాను.. కానీ శ్రీరాజ్ గారు దళితుడు ఒకసారి ముఖ్యమంత్రి చేశారు కనుక ఈసారికి కాపులకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు… అది కరెక్టే అయినా కాపులకన్నా ధారుణమైన పరిస్థితులు మనవి.. కావున దళిత ముఖ్యమంత్రి కానపుడు రిస్క్ ఎందుకని నేను సైడయ్యాను.. కానీ హర్షన్న అంటే ఏనాడూ నాకు ధ్వేషం లేదు..
కొంతకాలానికి కువైట్ మహాసేన వారు చనిపోయిందనుకున్న మహిళను తిరిగి కుటుంబానికి చేర్చడానికి ప్రయత్నిస్తున్నారని సాక్షి పేపర్లో వేశారు.. దానిని విమర్శిస్తూ హర్షన్న వర్గం లైవ్ పెట్టి మహాసేన ని ధూషించారు.. నన్నూ నాకుటుంబాన్ని భూతులు తిట్టారు.. వాళ్ళని హర్షన్న సపోర్ట్ చేశారు.. మాకు బాధేసింది.. మేము గౌరవించే వ్యక్తి కారణం లేకుండా మాపై ధ్వేషం చూపించడం ఆశ్చర్యం కలిగించింది.. ఇదేమైనా రాజకీయ ఎత్తుగడేమో అని మేమూ ఎదురుదాడి చేశాం.. ఇప్పటికీ మా ఇరువర్గాలమధ్యా ఆ గొడవలు జరుగుతూనే వున్నాయి.. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హర్షన్నని రాజకీయంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చూసి మాకు కోపం వచ్చింది…
చాలా ప్లాన్ చేసి ఆయన్ని TDP లోకి ఆహ్వానించి అమలాపురం MP సీట్ ఆఫర్ చేసి ఆయన కాళ్ళుపట్టుకున్నారనే ఫోటోతో బదనాం చేసి ఇప్పుడు MP సీట్ ఇవ్వకపోవడం వెనుక కుట్ర తెలుసుకున్నాం.. ఇండీపెండెట్ గా పోటీచేయనివ్వకుండా మరియు చంద్రబాబునీ TDP నీ ఎండగట్టకుండా మరొక పార్టీ అవకాశం ఇచ్చినా వెళ్ళకుండా బంధించారు.. డబ్బుకి అమ్ముడుపోయాడనే అనుమానం కలిగించి ఆయన్ని Bad చేయాలని చూస్తున్నారు.. కానీ మీ ఎత్తులకి మా పైఎత్తులు వుంటాయని మర్చిపోవద్దు చంద్రబాబు గారు..
హర్షన్నకి YSRCP లోకి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం.. జగన్ గారు నమ్మితే కులమతాలకి అతీతంగా గుర్తిస్తారని మీకు తెలియని విషయంకాదు.. పండుల రవీంద్ర గారికి సీటు ఇవ్వకపోయినా MLC ఇస్తానని హామీ ఇవ్వడం జగన్ గారి చిత్తశుద్దికి నిదర్శనం.. బేషరతుగా YSRCP లోకి మీరు వస్తే మీకు మేము ఎల్లపుడూ తమ్ముళ్ళంగా తోడుంటాం.. మీకు అవమానం జరిగితే మీ తమ్ముళ్ళుగా మేము ఊరుకోలేం కనుకే ఈ ప్రపోజల్ ని పబ్లిక్ గా మీముందుకు తీసుకొచ్చాం… చంద్రబాబుగారికీ, పవన్ కళ్యాణ్ గారికీ ఒకమాట చెప్తున్నాం మీరు మమ్మల్ని విడగొట్టిరాజకీయం చేయాలని చూస్తే దానికి పైఎత్తు వేసి చిత్తుచేయగలిగిన తెలివి మాకుంది.. మేం మోసపోము..